పోలీసుల ముందుకు ఆర్జీవీ..!
ABN, Publish Date - Feb 06 , 2025 | 09:03 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గత ఏడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి తాజాగా మరోసారి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న విచారణకు రావాలని చెప్పగా.. ఆ రోజు షూటింగ్ ఉందని, అందుకే తాను విచారణకు రాలేనని ఆర్జీవీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు.
Updated Date - Feb 06 , 2025 | 09:03 PM