ఎండల్లో కార్ తగలపడకుండా ఉండాలంటే..

ABN, Publish Date - Apr 12 , 2025 | 10:24 PM

వేసవి కాలంలో మండుటెండల నడుమ కార్లు వేడెక్కడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి టైమ్‌లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే ఎండల దెబ్బకు కారు అతిగా వేడెక్కుతుంది.

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలంలో మండుటెండల నడుమ కార్లు వేడెక్కడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇలాంటి టైమ్‌లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే ఎండల దెబ్బకు కారు అతిగా వేడెక్కుతుంది. దీని వల్ల కారులోని కూలింగ్ సిస్టమ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ దెబ్బకు కారు కొన్నిసార్లు తగలబడొచ్చు. అందుకే తక్షణం ఇప్పుడు చెప్పబోయే సూచనలు ఫాలో అవ్వండి. ముందుగా కూలర్‌ను చెక్ చేసుకోండి. ఇటాలియన్ గ్లైకో, ప్రోపైలిన్ గ్లైకో వంటి వాటిని యాంటీ ఫ్రీజర్లు అంటారు. నీటిలో తగిన మోతాదులో ఏదైనా యాంటీ ఫ్రీజర్ కలిసి ఉంటే దాన్ని కూలెంట్ ద్రావణం అంటారు. కారులో కూలెంట్‍ను ఉపయోగించాలి. దీని వల్ల భారీ ఉష్ణోగ్రతల ప్రతికూల ప్రభావం ఇంజన్‍పై పడకుండా ఉంటుంది.

Updated at - Apr 12 , 2025 | 10:24 PM