కసిరెడ్డి.. మూడో సారి డుమ్మా

ABN, Publish Date - Apr 09 , 2025 | 04:33 PM

liquor Scam: మద్యం కుంభకోణం కేసులో మూడో సారి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో కసిరెడ్డిపై పోలీసు అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతి, ఏప్రిల్ 9: మద్యం కుంభకోణం కేసులో (Liquor Scam Case) సిట్‌ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajshekhar Reddy) మరోసారి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న కసిరెడ్డికి ఇప్పటికే మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చింది. కసిరెడ్డి విచారణకు వస్తారని ఇప్పటి వరకు పోలీసులు ఎదురు చూశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయంలోని సిట్ కార్యాలయంకు రావాలని నాలుగు రోజల క్రితమే కసిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కసిరెడ్డి కోసం ఈరోజు మధ్యాహ్నం వరకు సిట్ అధికారులు ఎదురుచూశారు. కసిరెడ్డికి ఫోన్లు చేయగా.. ఆయన్ ఫోన్లు అన్నీ స్విచ్‌ఆఫ్‌గా ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. కసిరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో కూడా హైదరాబాద్‌లో ఆయన లేరని అధికారులు గుర్తించారు.


దీంతో ఇంటికి నోటీసులు అంటించి, ఆయన బంధువులకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇంతకుముందు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా తనకు సంబంధం లేని విషయంలో నోటీసులు ఇస్తున్నారని విజయవాడ సీపీకి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మెయిల్ పంపారు. అంతేకాకుండా తనపై అక్రమంగా కేసు పెట్టారని హైకోర్టులో కూడా కసిరెడ్డి పిటిషన్ వేశారు. అయితే సిట్‌ బృందంతో ఏకీభవిస్తూ విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కసిరెడ్డికి నోటీసులు ఇవ్వగా.. ఈరోజు విచారణకు కసిరెడ్డి డుమ్మా కొట్టారు. లిక్కర్‌ స్కామ్‌లో కసిరెడ్డి ప్రమేయానికి సంబంధించి సిట్ బృందం కూడా కీలక సాక్షాలు సేకరించాక కూడా.. కసిరెడ్డి విచారణకు రాకపోవడంతో అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయనను అరెస్ట్ చేసి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Andhrapradesh Division Act: పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Read Latest AP News And Telugu News

Updated at - Apr 09 , 2025 | 04:33 PM