అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న లోకేష్ దంపతులు

ABN, Publish Date - Mar 23 , 2025 | 08:30 PM

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌లతో కలిసి పవిత్ర శ్రీహరి మందిర్ సాహిబ్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పంజాబ్ లోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి.. అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించానని చెప్పారు.

అమృత్‌సర్, మార్చి 23: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌లతో కలిసి పవిత్ర శ్రీహరి మందిర్ సాహిబ్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పంజాబ్ లోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి.. అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించానని చెప్పారు. స్వర్ణ దేవాలయం సందర్శన మహా భాగ్యమని తెలిపారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 08:30 PM