సంక్రాంతి స్పెషల్.. మల్లన్న జోష్
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:12 PM
Sankranti 2025: తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కొత్త పంటలతో ప్రతీ ఇళ్లూ ధన ధాన్యాలతో కళకళలాడుతుందన్నారు. ఆంధ్రులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. తెలంగాణలో పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా జరుపుకుంటున్నామన్నారు.
హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్‌లో (Hyderabad) పతంగుల సందడి మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్స్ ఫెస్టివల్స్ (Kites Festival) జరుగుతున్నాయి. యువత పోటాపోటీగా పతంగులు ఎగురవేస్తున్నారు. బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసి కైట్ ఫెస్టివల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Malla Reddy) పాల్గొని సందడి చేశారు. ఎంతో ఉత్సాహంగా కైట్స్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. కొత్త పంటలతో ప్రతీ ఇళ్లూ ధన ధాన్యాలతో కళకళలాడుతుందన్నారు. ఆంధ్రులకు ఇది పెద్ద పండుగ అని అన్నారు. తెలంగాణలో పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా జరుపుకుంటున్నామన్నారు. ‘‘ఇది నేను పుట్టిన బస్తీ.. నేను నడిచిన రోడ్డు.. పాలమ్మిన.. పూలమ్మిన.. విద్యాసంస్థలు పెట్టడం, ఎమ్మెల్యే, మంత్రి అవడం అంతా భగవంతుడి ఆశీస్సులే’’ అని మాజీ మంత్రి మల్లా రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఈ రాశి వారికి షాపింగ్, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి
Hyderabad: పండగపూట నిలిచిన నీటి సరఫరా.. ఇబ్బందులు తప్పవా
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 13 , 2025 | 04:13 PM