జగన్ మోహన్ రెడ్డి పర్యటన.. వైసీపీ డ్రామా..
ABN, Publish Date - Apr 08 , 2025 | 06:34 PM
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో వైసీపీ అల్లరిమూకలు చేసిన పనికి ఆ పార్టీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇటీవల హత్యకు గురయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో వైసీపీ అల్లరిమూకలు చేసిన పనికి ఆ పార్టీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇటీవల హత్యకు గురయ్యారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఆ గ్రామానికి వెళ్లారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. హెలికాప్టర్‍పై దాడి చేసి రచ్చరచ్చ చేశారు. అయితే మెుదట తమను ఎవరో అడ్డుకుంటున్నారని ట్వీట్ పెట్టిన వైసీపీ.. ఆ తర్వాత అసలు పోలీసులు ఎవ్వరూ లేరని, అందుకే ఇలా జరిగిందంటూ మరో ట్వీట్ పెట్టింది. తమ కార్యకర్తలే అలా దాడి చేశారని తెలుసుకున్న వైసీపీ.. తప్పు దిద్దుకునేందుకు ప్రయత్నించింది. ఈ మేరకు ఆ నెపాన్ని పోలీసులపై నెట్టేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. మెుత్తానికి జగన్ షిక్కటి డ్రామాను పండించారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..
Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..
Updated at - Apr 08 , 2025 | 06:39 PM