తోడల్లుళ్ళ ఆత్మీయ ఆలింగనం

ABN, Publish Date - Mar 06 , 2025 | 01:26 PM

Chandrababu-Venkateshwar Rao: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విశాఖపట్నం, మార్చి 6: వాళ్లిద్దరూ తోడల్లుళ్లు. అందులో ఒకరు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వారిద్దరూ కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకున్నప్పటికీ.. ఒకే వేదికపై కలుసుకున్నది మాత్రం 30 ఏళ్ల తర్వాతే. వాళ్లు ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తెలు భువనేశ్వరిని చంద్రబాబు వివాహమాడగా, పురందేశ్వరిని దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు వివాహం చేసుకున్నారు. ఈ రకంగా చంద్రబాబు, వెంకటేశ్వరరావు తోడల్లుళ్ళు అయ్యారు. ఇదిలా ఉండగా.. విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈరోజు (గురువారం) జరిగింది.


ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలిసిన ఇద్దరు తోడల్లుళ్ళు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వేదికపై దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయనను ఎమోషనల్‌గా హగ్ చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Foundation Stone: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..

BJP victory: బీజేపీదే గెలుపు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2025 | 01:29 PM