Home » AB Venkateswara Rao
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తప్పుబడుతూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు.
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ (Central Administrative Tribunal) ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవ్వగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Andhrapradesh: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను (CAT) వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది.
తనపై రెండోసారి విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ‘సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్’ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్ని బెంచ్ పరిశీలించింది.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara rao) హైకోర్టులో పిటిషన్ వేశారు. తన విదేశీ పర్యటనను సీఎస్ తిరస్కరించటంపై పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. కాగా పిటిషన్‌పై విచారణ జరగగా నిర్ణయం మంగళవారానికి వాయిదాపడింది.