Home » ABN
Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని నైట్ క్లబ్ భవనం పైకప్పు కుప్పుకూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సంఖ్య 218కి చేరింది. అలాగే గాయపడిన వారి సంఖ్య సైతం పెరిగింది. వీరంతా ఆ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతోన్నాయి.
Sakshi: కుమార్తె ప్రేమించిన వాడితో వెళ్లిపోవడంతో ఆ కన్న తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. బుజ్జగించి ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..
Heavy Rains: హైదరాాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పెద్ద పెద్ద చెట్టు విరిగిపడిపోతున్నట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
China : ప్రపంచదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నాడు. అలాంటి వేళ.. చైనా తన సుంకాలను పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతయ్యే వాటిపై ట్రంప్ భారీగా సుంకాలను పెంచారు. అలాంటి వేళ.. అమెరికా ఎలా వ్యవహరించిన తాము మాత్రం తగ్గదేలే అంటుంది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టింది.
Lavu sri krishna devarayalu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహర శైలి వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలుకు విఘాతం కలుగుతోందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.
Pastor Praveen: ప్రవీణ్ పగడాల కేసును ప్రభుత్వం ఎంత సావధానంగా పరిష్కరించిందో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వివరించారు. ఈ కేసులో భాగంగా వాళ్లు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలంటే.. చాలా గంటల పాటు శ్రమించి.. ఆ ఫుటేజ్ ఇచ్చామన్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీసీ ఫుటేజ్ కెమెరా అందజేశామని ఆమె పేర్కొన్నారు. పోస్ట్ మార్టం చేయడానికి దాదాపు 38 గంటలు పట్టిందన్నారు. ఓ బాడీకి 10 గంటలలోపు పోర్ట్ మార్టం నిర్వహిస్తే.. స్పష్టమైన నివేదిక ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కానీ 38 గంటల తర్వాత బాడీ పోస్ట్‌మార్టం జరిగిందని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వడానికి ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
Aabdul Aziz: వక్ఫ్ బోర్డు ఆస్తుల విక్రయంపై ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆస్తుల వివరాలను ఆయన వివరించారు. రంజాన్ మాసంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం తెలంగాణకు వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఆయన వివరించారు.
Central Minister: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి మనవరాలిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. దీంతో అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడిప్‌లో నెల్లూరు సంతపేటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జొన్నాదుల కోటేశ్వరరావు కారు గెలుచుకున్నారు. కారు గెలుచుకోవడంతో పట్టరాని ఆనందంలో కోటేశ్వరరావు మునిగిపోయారు.
Mark Shankar Pawanovich: స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనో విచ్ కొద్దికొద్దిగా కొలుకొంటున్నాడు. ఐసీయూ నుంచి అతడిని గదిలోకి మార్చారు. మరి కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో అతడు ఉండాలని సూచించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలియగానే చిరంజీవి దంపతులతోపాటు పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.