Home » AICC
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్‌పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.
దేశం దిశ, దశ మార్చే ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గట్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్చార్జులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఛాపర్లో సీఎం యూపీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి యూపీకి రేవంత్ పయనమయ్యారు. రాయబరేలీకి వెళ్లేముందు ఖర్గే బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు.
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు. నిజానికి మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. నేటి సాయంత్రం సీఈసీ మీటింగ్‌లో రేవంత్ పాల్గొననున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది. సీఏం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు.
మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ కేంద్ర హై కమాండ్ది ఒక దారి... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది మరో దారిలా ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నాడు ఓ పత్రికా ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వై నాట్ 175 కొద్ది రోజుల క్రితం జగన్ నోట గట్టిగా వినిపించిన మాట.. రానురాను స్వరం మారింది. సంఖ్య మారుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకటైతే.. రెండోది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. జగన్ నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోందంట. తాజాగా జగన్‌కు చెల్లి షర్మిల (Sharmila) భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్.షర్మిల.
ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు.