Home » AP Assembly Budget Sessions
ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా కొత్త బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు ప్రతిపాదించింది.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్రానికి ఆర్థిక పునరుజ్జీవం పోయడమే బడ్జెట్
వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి, అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి పుస్తకాలు వచ్చినా వైసీపీ రంగులు పులిమేసేవారు. చివరికి బడ్జెట్ ప్రతులకు కూడా బులుగు రంగులు కనిపించేవి.
అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కాగా, 10.09 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి అడుగు పెట్టారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ 2024 25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష హోదా కేటాయించక పోవడంతో.. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానని ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన వాటితోపాటు లేని వాటినీ సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Andhrapradesh: వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరగాలన్నారు. రేపు (మంగళవారం) బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.
Andhrapradesh: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual keshav) ఈరోజు (సోమవారం) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే రూ.43402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గాను మంత్రి పయ్యావుల కేశవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. 2024 - 25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల.
Andhrapradesh: రూ.2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో అత్యధికంగా విద్య, నైపుణ్య రంగం , వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్- గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి - రాష్ట్ర రహదారుల కోసం కేటాయింపులు చేశారన్నారు. అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23% బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమని చెప్పవచ్చన్నారు.