Share News

Payyavual Keshav: వైసీపీ సమాజానికి హానీకరం.. సభలో పయ్యావుల సీరియస్ కామెంట్స్

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:13 PM

Payyavual Keshav: ‘‘బక్కోడి బువ్వను లాక్కొని బలిసిపోదామంటే కుదరదు.. గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కొనే ప్రయత్నం చేసింది కాబట్టే.. ప్రజలు కూటమికి అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ సభలో మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.

Payyavual Keshav: వైసీపీ సమాజానికి హానీకరం.. సభలో పయ్యావుల సీరియస్ కామెంట్స్
Minister Payyavula Keshava

అమరావతి, మార్చి 4: వైసీపీపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavuala Keshav) సభలో సంచలన కామెంట్లు చేశారు. బడ్జెట్‌పై రిప్లై ప్రారంభించిన మంత్రి.. వైసీపీపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్ర పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతే కాకుండా నాటి, నేటి ప్రభుత్వాల మధ్య తేడాలను చెప్పారు. బాలయ్య డైలాగ్స్‌ చెబుతూ ఇరు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాలను సభ ముందు ఉంచారు మంత్రి పయ్యావులు. వైసీపీ సమాజానికి హానికరం అంటూ కామెంట్స్ చేశారు. సిగరెట్ పెట్టెల మీద స్టాట్యూరీ వార్నింగ్ ఇచ్చినట్టుగా.. వైసీపీ సమాజానికి హానీకరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత తమసపై ఉందన్నారు. సభకు రాకుండా డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు బయట కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


గత ప్రభుత్వం గురించి పదే పదే ప్రస్తావించడం దేనికని ప్రశ్నిస్తున్నారన్నారు. వైసీపీ హానికరం అనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు గుర్తించారని.. అందుకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారని తెలిపారు. బక్కోడి బువ్వను లాక్కొని బలిసిపోదామంటే కుదరదని.. గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కొనే ప్రయత్నం చేసింది కాబట్టే.. ప్రజలు కూటమికి అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ‘‘లిక్కర్ , సిగరెట్ పై వేసే స్టాట్యటరీ వార్నింగ్‌లాగా వైసీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని శాసన సభ్యులు జనం లోకి తీసుకువెళ్ళాలి. మీరు అనుమతిస్తే నా సమయం తగ్గించుకొని వైసీపీ వారు ఏం మాట్లాడుతారో మాట్లాడమనండి. జీత భత్యాలు, అప్పులు, వడ్డీలకు వచ్చే ఆదాయం సరిపోతుంది అది కూడా 1శాతం లోటు ఉంది ... దీనిలో కమిటెడ్ ఎక్సపెండీచర్ చూపలేదు. అప్పు చేయడం తప్పుకాదు... చేసిన అప్పు క్యాపిటల్ ఇన్వెష్టమెంట్‌లో చేయాలి... ప్రోడక్టవిటీ పెంచాలి. చంద్రబాబు ఉన్నప్పుడు వ్యవసాయ రంగం 16 శాతం.... సేవల రంగం 12 శాతం ఉండగా.. . జగన్ వచ్చాక వ్యవసాయం, సేవల రంగం 3 శాతం పడిపోయింది. ఈ మూడు శాతం ఉంటే 76 వేల కోట్లు అదనంగా వచ్చేది. అధికారులను అందరికి ఇదే డైరెక్షన్‌లో ముందుకు వెళ్లే లా చూడాలిని కోరుతున్నా. అప్పుపుట్టే సామర్ధ్యం పెరిగితే ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టే శక్తి పెరుగుతుంది. 2014-19 మద్య ఇరిగేషన్‌లో 40వేల కోట్లు ఖర్చు పెట్టారు. విడిపోతే పడిపోతాం అని అనుకున్నాం అయితే చంద్రబాబు నిలబెట్టాడు పరుగుపెట్టించారు. గత అయిదేళ్లలో వైసీపీ ఏం చేసింది. రాయలసీమ, ఉత్తరాంద్ర నుంచి నీటి కోసం విజ్జప్తులు వచ్చేవి. అయితే ఇప్పడు కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లల నుంచి వస్తున్నాయి’’ అని మంత్రి తెలిపారు.

Botsa on lokesh: అలాంటి రాజకీయాలు విద్యా వ్యవస్థకు పెద్ద కళంకం


ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ప్రజెంటేషన్ ఇచ్చారు పయ్యావుల. వచ్చే ఆదాయమెంత.. పెడుతున్న ఖర్చులు ఎంత అంటూ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి రూ.154065 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే.. ఖర్చు రూ.154971 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఇంతటి ఆర్థిక దుస్థితిలోకి నెట్టేసి వెళ్లిపోయింది గత ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. వచ్చే ఆదాయం అంతా.. బొటాబోటిగా ఖర్చులకు సరిపోతుందన్నారు. బయట ఉండి ఏదేదో కామెంట్లు చేసే బదులు.. సభకు వచ్చి చెప్పొచ్చుగా అని హితవుపలికారుర. ‘‘స్పీకర్ అనుతిస్తే.. నా టైమ్ తగ్గించుకుని వారికి మాట్లాడే సమయం ఇస్తాను. అయినా వారు సభకు రాలేరు.. కారణం వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసం’’ అంటూ పయ్యావుల వ్యాఖ్యలు చేశారు.


సభలో బాలయ్య డైలాగ్స్

అలాగే గత ప్రభుత్వం, ప్రస్తుతవ ప్రభుత్వం మధ్య తేడాలను వివరిస్తూ బాలయ్య కామెంట్లను సభలో ప్రస్తావించారు మంత్రి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ సభలో నాటి, నేటి ప్రభుత్వాల మధ్య తేడాను వివరించారు. వైసీపీ సంపద సృష్టి వేరని.. కూటమి సంపద సృష్టి వేరన్నారు. వైసీపీ సంపద వారి కుటుంబాల కోసం అయితే.. కూటమి సంపద సృష్టి సమాజం కోసమని చెప్పుకొచ్చారు. బాలయ్య మాటల్లో చెప్పాలంటే.. బోత్ ఆర్ నాట్ సేమ్ అని అన్నారు. ఎక్సైజ్, గనులు, ఇసుక ఆదాయం దారి మళ్లలేదా అని ప్రశ్నించారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని కూటములు చూశామని.. కానీ చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సఖ్యత చూసి అసెంబ్లీ డ్రాప్ అవుట్ల కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న రిలేషన్స్ చూసి.. కుళ్లు కుంటున్నారని తెలిపారు. ఈ బంధానికి పునాది రాష్ట్రం.. రాష్ట్ర శ్రేయస్సు.. రాష్ట్ర భవిష్యత్తు.. ఇందులో రాజకీయ కారణం లేదని.. స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.


ఇంత వడ్డీనా.. వీళ్లనేమనాలి..

9 శాతానికి మించి ఉన్న అప్పులను గుర్తించామని.. దాదాపు 141 రుణాలు ఉన్నాయన్నారు. కొన్ని దాదాపు 13.4 శాతం వరకు వడ్డీకి తెచ్చారని తెలిపారు. 9 శాతం.. 10 శాతం.. 11 శాతం.. 12 శాతం.. ఇలా పెంచుకుంటూ పోతూ ఏకంగా 13.4 శాతానికి అప్పులు తీసుకొచ్చారంటే.. వీళ్లనేమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా గత ప్రభుత్వం అప్పు తీసుకుందని.. ఈ రోజుకు ఆ సంస్థకు 154 కోట్ల రూపాయల మేర అప్పు ఉందన్నారు. ఈ అప్పును 13.4 శాతం మేర వడ్డీకి తెచ్చారని తెలిపారు. అంటే సంవత్సరానికి ఈ అప్పుపై వడ్డీనే 20.60 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరపాల్సి వస్తుందని.. ఇప్పుడు తాము బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. బ్యాంకర్లు అంగీకరిస్తే.. ఆ వడ్డీ రేటు 9 శాతానికి తగ్గుతుందన్నారు. అప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ 13.83 కోట్లు రూపాయలుగా ఉంటుందని వివరించారు. అంటే ఈ ఒక్క రుణం మీదే 6.76 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుందన్నారు. ఇలా 1 లక్ష కోట్ల రూపాయల అప్పు మీద వడ్డీ రేట్లు తగ్గితే.. రాష్ట్ర ఖజానాపై భారం ఎంత వరకు తగ్గుతుందో ఆలోచించాలన్నారు. బ్యాంకర్లతో నెగోషియేషన్స్ మొదలయ్యాయని.. ఈ నెలాఖరుతో వడ్డీ రేట్లు తగ్గించగలమని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2025 | 04:23 PM