Home » Aranii Srenevasulu
Andhrapradesh: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులకు అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటీవలే తాను తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. ఆయనతో మాట్లాడిన తరువాత ప్రజల కోసం పరితపించే పవన్ కనిపించారన్నారు.