Home » Bengaluru
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒకతడి వాహనాన్ని పరిశీలించగా రూ.49 వేలు కనిపించింది. ఫైన్ కట్టాలని స్పష్టం చేయడంతో సదరు వ్యక్తి జరిమానా చెల్లించాడు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ గుండెపోటుతో కన్నుమూశారు. యాదగిరి జిల్లా షోరాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024) రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు UP వారియర్స్‌ను రెండు పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన యూపీ 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) తొలి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించడం విశేషం.
కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను, తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిసామని, సీట్ల షేరింగ్‌పై చర్చలు జరిపామని చెప్పారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని చెప్పింది.
బెంగళూరు నగరాన్ని పీడిస్తున్న శాంతిభద్రతల సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బెంగళూరు నగరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
హెల్మెట్ ధరించండి - ప్రాణాలు కాపాడుకోండి.. అని ఎన్ని సార్లు చెప్పినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోడ్లపై ఎలాంటి జాగ్రత్తలు, నియమాలు పాటించకుండా రయ్యిమని దూసుకుపోతున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. దినదినాభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలను ఈ సమస్య ఏళ్లుగా పట్టి పీడిస్తోంది. వలసలతో ఓ వైపు నగరాలు కిక్కిరిస్తుంటే మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతోంది.
చెన్నై - మైసూరు(Chennai - Mysore)ల మధ్య వారానికోసారి నడిచే వందేభారత్ స్పెషల్ రైలు సేవలను పొడిగిస్తూ నైరుతి రైల్వే నిర్ణయం తీసుకుంది.