Home » BRS Chief KCR
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పవర్ కమిషన్ మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్‌కు అందిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని పవర్ కమిషన్ తన నోటీసుల్లో కేసీఆర్‌కు స్పష్టం చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.
తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.
గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఈరోజు(మంగళవారం) తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావుడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల, స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబరులో ఎంత మందికి క్రమబద్ధీకరించారు? ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత? బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది? రిజిస్ట్రేషన్ విలువ ఎంత?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ (Dasoj Shravan) బహిరంగ లేఖ రాశారు. పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా మీ పరిపాలన చాల అధ్వాన్నంగా మారిందని అన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..
కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. నిన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికలతో కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ సాధ్యం కాలేదని తెలిపారు.
తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...