Home » BRS
ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లిని మారుస్తారా అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా(Komirishetti Sai Baba) అన్నారు. ఈ నేల ఆస్తిత్వం, ఆత్మగౌరవంపై ఈ ప్రభుత్వం దాడిచేస్తోందని ఆయన ఆరోపించారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
తెలంగాణ పోలీసులకు మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పోలీసుల చర్యను వదిలిపెట్టమని హెచ్చరించారు. మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
రేవంత్ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏదని కవిత ప్రశ్నించారు.
పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. గత పదేళ్లు అధికారంలో ఉండి అధికారికంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
రాష్ట్రంలో దుర్మార్గ అరాచక పాలన సాగుతోందని, ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఆలిని మార్చిన వాళ్లను చూశాంగానీ.. తల్లిని మార్చినవాళ్లను చూడలేదని.. సీఎం రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ ఆ పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈరోజు తీర్పు నేపథ్యంలో మరికొన్ని అంశాలను న్యాయమూర్తి. ప్రస్థావించారు. ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్: డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2009, డిసెంబర్ 9న అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఒక ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెడుతున్నామని తెలిపారు. ఇది చరిత్రలో నిలిచిపోయిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు.