Share News

మేడిగడ్డ కేసులో మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:31 AM

హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులకు కాస్త ఊరట లభించింది.

మేడిగడ్డ కేసులో మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

  • కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఊరట

హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులకు కాస్త ఊరట లభించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేస్తూ జారీ అయిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్‌, హరీశ్‌రావు, ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు వ్యక్తిగత హాజరు నుంచి కేసీఆర్‌, హరీశ్‌రావులకు మినహాయింపు ఇచ్చింది.

Updated Date - Feb 14 , 2025 | 04:31 AM