Hairsh Rao: గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:14 PM
Harish Rao: రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.

సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) మరోసారి ఫైర్ అయ్యారు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయవద్దని అన్నారు. శుక్రవారం గుమ్మడిదలలో జీహెచ్ఎంసీ డంప్‌యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా స్థానికులు చేస్తున్న ఆందోళనకు మాజీ మంత్రి మద్దతు తెలుపుతూ.. సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయకండి అంటే మొండిగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పర్యావరణం దెబ్బతింటదని, నర్సాపుర్ చెరువు కలుషితం అవుతుందని.. ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయనే వద్దు అంటే పట్టించుకోవడం లేదన్నారు.
ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపామని చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు. గుమ్మడిదల రైతులు అందరికీ ఆదర్శమని.. బంగారం వంటి పంటలు పండిస్తారని తెలిపారు. తక్షణమే డంపు యార్డు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల బూములు గుంజుకున్నారని..న్యాల్కల్‌లో పచ్చటి పొలాలు గుంజుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నామన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
ఇందిరమ్మ రాజ్యం అన్నారని.. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఊళ్లలో మంది ఎంత మంది ఉంటే అంత మంది పోలీసులను పెట్టారని.. ఓట్లేసిన పాపానికి ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. రుణమాఫీ, రైతు బందు, మహాలక్ష్మి, ఇలా అన్నీ మోసమే అని అన్నారు. గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పకుండా అసెంబ్లీ వేదికగా గుమ్మడిదల ప్రజల తరపున పోరాటం చేస్తామని... ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్లు కూడా ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని.. అయినా పట్టించుకోవడం లేదన్నారు. టిప్పర్లు, పోలీసులను వెనక్కి తీసుకోవాలని.. ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కళ్లు తెరవకుంటే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. చేతిలో అధికారం ఉందని బలవంతంగా పని చేయవద్దన్నారు. రెండు సార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌లను హెచ్చరిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతంటే..
పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News