Kishan Reddy: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:46 PM
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రంలో మార్పు రాలేదు... మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉంది’’ అని అన్నారు.

సంగారెడ్డి, ఫిబ్రవరి 14: తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయిందని విమర్శించారు. పదేళ్ళలో బీఆర్‌ఎస్ పై వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో మార్పు రాలేదు... మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉంది’’ అని అన్నారు. బీజేపీ మాత్రమే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులు గేలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ఉంటారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యలు చేశారు. అసలు శాసనమండలి ఉందా లేదా అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్‌ఎస్ వ్యవహరించిందన్నారు.
హైదరాబాద్‌లో నిరుద్యోగుల వద్దకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కేంద్రం పీఆర్సీ ప్రకటించినా రాష్టంలో మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. రాబోయే రోజైల్లో కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ మాట దేవుడేరుగు ఉన్న స్కూళ్లకు రంగులు వేయలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దెబ్బతీశాయని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్, కరీంనగర్ యూరియా ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి అంతా బీజేపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. రైతులకు సబ్సిడీతో ఎరువులు అందిస్తున్నది మోడీ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
Acid Attack: ప్రేమికుల దినోత్సవం రోజు అమానుష ఘటన
రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది మోడీ అని అన్నారు. 2014లో మోడీ ప్రధాని కాక ముందు 3 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు 26 వేల కోట్లతో తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘‘కేంద్రం ఏం చేసింది అంటూ మాట్లాడుతున్నారు. కేసీఆర్, రేవంత్ కలిసి వస్తే రండి. పదేళ్ళలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తాం. గ్రామ పంచాయితీలకు రాష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా’’ అంటూ సవాల్ విసిరారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని మండిపడ్డారు. రాబోవు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా మాత్రమే వస్తుందన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు. తెలంగాణలో అధికారంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ.. ఎంతంటే..
పోచంపల్లి ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో బిగ్ ట్విస్ట్
Read Latest Telangana News And Telugu News