Home » Case
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ఫలితమే నేటి సుప్రీంకోర్టు తీర్పు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ, జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. సోమవారం తక్షణ విచారణ కోరుతూ పిటిషనర్ విశాల్ తివారీ మెన్షన్ చేయనున్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములును ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.