Home » Chandrababu
Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Andhrapradesh: జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముస్లిం పెద్దలు ఘనంగా సన్మినించారు.
దార్శనికులు ఉజ్వల భవిష్యత్కు, అభివృద్ధికి బాటలు వేస్తారు. సంపద, ఉపాధి చేకూరుస్తారు. నాయకుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. అలాంటి నాయకుడే చంద్రబాబు. అదే విధ్వంసకారులు నాయకులైతే... కట్టడాలను కూల్చడం, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దోపిడీలతో అల్లకల్లోలం చేస్తారు. ఈ తరహా దమననీతి, ఫ్యూడల్ హింస లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడే జగన్మోహన్రెడ్డి.
ఏపీలో అయితే అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేడు ఐదు ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజవకర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నేటితో 82 నియోజవకర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి.
Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.
Andhrapradesh: వైసీపీ అరాచకాలను అంతమొందించడానికి... రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులందరూ ప్రజాక్షేత్రంలోకి రాక తప్ప లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర...
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు తెలిపారు. బుధవారం చంద్రబాబుతో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కలిసి టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు టీడీపీకి మద్ధుతుగా నిలిచిందని గుర్తుచేశారు.
Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్ దిప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.