Home » CID
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, ఆయనకు నోటీసులు ఇవ్వలేదని సీఐడీ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టులో తెలిపారు. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది
శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడు తులసిబాబుకు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన విషయం. కోర్టు ఈ నెల 27న బెయిల్‌పై నిర్ణయం ఇవ్వనున్నట్లు తెలిపింది
శుక్రవారం గుంటూరులోని సీఐడీ కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.
Vamsi CID Custody: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలిగింది. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో విజయసాయి రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసులు ఇచ్చారు.
Posani CID custody: ఒక్క రోజు విచారణ నిమిత్తం వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సీఐడీ విచారించనుంది.
గుంటూరు జడ్జి ఎదుట పోసాని కృష్ణమురళీని సీఐడీ పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా? అంటూ ప్రశ్నించారు.
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం విజయవాడలోని సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విజయసాయిని మినహా ఇంకా ఎవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. అయితే విడుదలకు బ్రేక్ పడింది. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. మంగళవారం పోసానికి కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.