Share News

Posani CID custody: ఒక్క రోజు సీఐడీ కస్టడీకి పోసాని

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:18 AM

Posani CID custody: ఒక్క రోజు విచారణ నిమిత్తం వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సీఐడీ విచారించనుంది.

Posani CID custody: ఒక్క రోజు సీఐడీ కస్టడీకి పోసాని
Posani Krishna Murali CID custody

గుంటూరు, మార్చి 18: వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని (Posani Krishna Murali) సీఐడీ పోలీసులు (CID Police) కస్టడీలోకి తీసుకున్నారు. పోసానిని ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం సీఐడీ కేసులో గుంటూరు జైలులో వైసీపీ నేత రిమాండ్‌లో ఉన్నారు. దీంతో జిల్లా జైలు నుంచి పోసానిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని పోలీసులు ప్రశ్నించనున్నారు. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈరోజు గుంటూరు కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.


పోసానిని కస్టడీకి కోరుతూ నిన్న(సోమవారం) గుంటూరు జిల్లా కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఒక్కరోజు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈరోజు 10 గంటలకు గుంటూరు జిల్లా జైలులో ఉన్న పోసానిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా గుంటూరు జీజీహెచ్‌కు తరలించి సీనీ నటుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు రీజనల్ సీఐడీ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు పోసాని కృష్ణ మురళిని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావేశంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు... ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా సమావేశం పెట్టారా లేక మరెవరైనా ఫోటో తయారు చేసి సమావేశం పెట్టమని ఆదేశించారా అనే కోణంలో కస్టడీలో సీఐడీ అధికారులు పోసానిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Budameru river issue: బుడమేరు సమస్యపై మంత్రి నిమ్మల సమాధానం ఇదీ..


ఇదిలా ఉండగా.. పోసానిని సీఐడీ అధికారులు జడ్జి ముందు హాజరుపరిచిన సమయంలో.. తనను వేధింపులకు గురిచేస్తున్నారని, రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు పోసాని ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇక కర్నూలు జిల్లా అదోని, పల్నాడు జిల్లా నరసరావుపేట, కృష్ణా జిల్లా భవానీపురం పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల రిమాండ్‌కు సంబంధించి బెయిల్ వచ్చిన నేపథ్యంలో పోసాని విడుదలవుతారని భావించిన గుంటూరు సీఐడీ పోలీసులు ఈకేసును తెరమీదకు తీసుకొచ్చి అతడిని అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోసాని నుంచి సీఐడీ అధికారులు ఎలాంటి సమాచారాన్ని రాబడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


ఇవి కూడా చదవండి...

DK Aruna Home Theft Case: డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో కీలక పరిణామం

Hyderabad crime news: పనిలో చేరిన 16 గంటల్లో ఊహించని షాకిచ్చిన మహిళ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 11:50 AM