Home » CID
Andhrapradesh: సిట్ కార్యాలయంలో దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని.. వేస్ట్ పేపర్స్ను దగ్ధం చేశామంటూ సిట్ అధికారులు ఇచ్చిన వివరణపై టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్ అధికారులు ఇచ్చిన వివరణకు ఎటువంటి పొంతన లేదన్నారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కచ్చితంగా దీనికి సిట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయ కాంపౌండ్లో హెరిటెజ్కు సంబంధింన కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో హెరిటేజ్ సంస్థ కి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ఇదేంటని ప్రశ్నించగా.. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి పెట్టమని సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సీఐడీ కార్యాలయం సిబ్బంది చెప్పారట.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.
బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో అసోంలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో రాహాల్ సహా 11 మంది కాంగ్రెస్ నేతలకు అసోం సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ వేసిన ఛార్జిషీట్ను విజయవాడ ఎసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని...
కర్నూలు ఎస్సై సృజన్ పరారీలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ సీఐడీ పేరుతో బెదిరింపు కేసులో నిందితుడిగా ఉన్నారు. అసలేం జరిగిందంటే.. డీఐజీ కార్యాలయంలో ఎస్సైగా పని చేస్తున్న సృజన్ పది మందితో కలిసి ముఠాను తయారు చేసుకున్నారు.
హైదరాబాద్: విదేశీయులు, శరణార్థులకు ఓ ముఠా భారత పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టయింది. 92 మందికి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించింది. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సీఐడీ అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని ...