Home » CM Jagan
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. విజయం తమదేనని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని తేల్చి చెబుతున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా చేరారు.
మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్ సర్కారుది ఆది నుంచీ ఆర్భాటమే! రోజురోజుకూ కొత్త రుచ్చులు అంటూ సాక్షాత్తూ సీఎం జగన్మోహన్రెడ్డే ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే అన్నది సుష్పష్టం. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలల్లో అదీ లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.8.57, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రూ.5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు.
లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని.. అటు ఒకటో నెంబర్ గాని ఇటు ఐదో నెంబర్ గాని కచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు.
ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల ఊబిలో నెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ (Dundee Rakesh) ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతలు గుండెలు గుభేల్ అని కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
బ్లూ మీడియాలో వార్తలు చూస్తుంటే పూర్తిగా దిగజారిపోయారనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు (Ashok Babu) ఆరోపించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.
జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని తెలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సచివాలయం నుంచి కీలకమైన ఫైల్స్, ఈ ఫైల్స్ ను మాయం చేసే పనిలో ఉన్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎస్ పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు
కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడంతో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది. ఎక్కడ ఓడిపోతాననే భయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరిపారు. జగన్ ఇలాకా పులివెందులలో అసెంబ్లీకి టీడీపీకి వేస్తాం అని, పార్లమెంట్ స్థానానికి తనకు ఓటు వేయాలని అవినాశ్ రెడ్డి సమాచారం పంపించారని తెలిసింది.