Home » CM Jagan
సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్‌కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
పోలింగ్‌కు ముందు డికోడర్ ఛానల్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం
ప్రభుత్వ శాఖల ఖజానాను ఖాళీ చేసి మరీ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్’ (ఏపీఎస్‌ఎ్‌ఫసీ)లోకి డిపాజిట్ల రూపంలో జమ చేయించారు. కానీ...
సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్‌పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ నిరపరాధని, అమాయకుడు సతీష్‌ని పోలీసులు కేసులో అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం అన్నారు. సీఎం జగన్ రాజకీయ లబ్దికోసమే రాళ్ళ దాడి అంటూ డ్రామాకి తెరతీసారని న్యాయవాది సలీం కోర్టుకు వెల్లడించారు.
ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు.
మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు.
బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌పై (CM Jagan) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీచేసిన విషయం తెలిసిందే.