Share News

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

ABN , Publish Date - May 28 , 2024 | 07:26 PM

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్‌కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

Ap politics: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్..

అమరావతి: సీఎం జగన్‌(CM Jagan)పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్‌(Satish)కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్(Bail) మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం, ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలంటూ నిందితుడిని ఆదేశించింది. ప్రస్తుతం సతీశ్ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.


అసలేం జరిగిందంటే..!

విజయవాడలో ఏప్రిల్ 13న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. బస్సు ఎక్కి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో కొందరు ఆయనపై పూలతోపాటు రాళ్లు విసిరారు. దీంతో జగన్ ఎడమకంటికి గాయం అయ్యింది. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై వైసీపీ నేతలు హత్యాయత్నం కేసు పెట్టారు. దీంతో సింగ్ నగర్ చెందిన దుర్గారావు, సతీశ్‌తోపాటు పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే దాడి జరిగిన సమయంలోనే కరెంట్ పోవడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కావాలనే దాడి చేయించుకొని ప్రతిపక్షాలపై నెట్టడం సీఎం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 2014ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా ఆడారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడికి బెయిల్ రావడంపై అధికార, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఇది కూడా చదవండి:

NTR Jayanthi: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం.. మోదీతో చంద్రబాబు!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 07:33 PM