Home » CM Jagan
తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది.
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది.
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు.
హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ను ఓడించినట్లే, ఏపీలో జగన్ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.
సీఐడీ డీజీని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల బృందం సోమవారం కలిసింది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.