Home » Crime
ప్రీలాంచ్ పేరుతో ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ. వేల కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఎండీ లక్ష్మి నారాయణపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్‌పై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది.
జగిత్యాల కేంద్రంగా వస్తు సేవల పన్ను ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అక్రమాల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఐటీసీ అవకతవకలపై సుమారు 9 నెలల క్రితం జగిత్యాలలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసి ఓ జీఎస్టీ ప్రాక్టిషనర్‌ను అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు..ఐటీసీ రికవరీపై దృష్టిపెట్టారు.
పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకుంది. వారిని అడ్డుతొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలు తయారు చేసి వడ్డించింది. రాత్రి భోజనం చేసిన 13 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతూ అందరూ..
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది.
భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని గురువారం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన చిన్నారి అస్ఫి యా ఉదంతంపై సమగ్ర విచారణ జర పాలని పీలేరులోని పలు ప్రజాసంఘా లు, ముస్లిం జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
హైదరాబాద్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వాహిస్తున్నారు. పక్కా విశ్వాసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ సెంటర్‌పై పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు మైనర్లకు హుక్కా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యంపై కలకలం రేగింది. ఆదివారం రాత్రి నుంచి పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
మదనపల్లె డివిజన పరిధిలో ఏడుచోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగతో పాటు అతడికి సహకరించిన బాలుడిని అరెస్టు చేసి 28 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ డి.కొండయ్యనాయుడు తెలిపారు.
గంజాయి కేసు లో ప్రఽధాన నిందితుడు మౌలాలి(28)ని శనివా రం అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండ య్యనాయుడు వెల్లడిం చారు.