Home » Cyber attack
మీ అడ్రస్ అప్డేట్ చేస్తే తపాలాశాఖ నుంచి వచ్చిన పార్సిల్ ఇంటికి చేర్చుతామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.43 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళకు 8210587741 నెంబర్ నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. కొత్త అడ్రస్ అప్డేట్(Update) చేస్తే పార్సిల్‌ను ఇంటికి చేర్చుతామంటూ వాట్స్‌పలో లింక్ పంపారు.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ క్రైమ్‌కు ప్రధాన కారణంగా మారిన సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లపై దృష్టిపెట్టింది.
కార్డ్ క్లోనింగ్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) డబ్బు కాజేసిన సందర్భంలో బాధితుడికి వివరాలు అందించడంలో జాప్యం చేసిన బ్యాంకు తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. తిరుమలగిరికి చెందిన శామిర్ పటేల్‌కు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది.
ఇప్పటి వరకు ఫెడెక్స్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్ పోస్టల్ సర్వీస్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్ డెలివరీ చేసేందుకు లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్ కోసం డెలివరీ లొకేషన్ షేర్ చేయమని, లేకపోతే పార్సిల్ రిటర్న్ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) నకిలీ వెబ్సైట్లు సృష్టించి నగరవాసిని మోసం చేసి రూ.8.94లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.
ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయన్న సైబర్ నేరగాళ్ల(Cyber criminals) ఉచ్చులో ఇద్దరు వృద్ధులు చిక్కారు. వారి మాటలు నమ్మి జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును వారికి పంపారు. కేటుగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సకాలంలో సైబర్ క్రైమ్ పోలీసులను(Cyber Crime Police) ఆశ్రయించగా, వారు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
రాజధాని హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహ్మద్, అరుళ్ దాస్, షమీర్ ఖాన్, ఎస్.సుమైర్ స్నేహితులు. మునావర్ స్నేహితుడు.
రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాంతానికి పోలీసు కమిషనర్‌గా ఉన్న అధికారి బంధువుకు.. సైబర్ నేరగాళ్లు కాల్ చేసి.. ఆన్లైన్ ఇన్వె్‌స్టమెంట్‌తో లక్షల్లో ఆదాయం అంటూ వలవేసి పలు దఫాలుగా రూ.16లక్షలు కాజేశారు.