Home » Delhi Excise Policy
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్‌ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
BRS MLC Kavitha: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్‌రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor policy scam)లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind Kejriwal)కు ఈరోజు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme court)లో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు మొదటిసారిగా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఈనెల 15న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈడీ అరెస్టును సమర్ధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాలు చేశారు.
దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. ఇక సీబీఐ కస్టడీకి అప్పగించడానికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును కోర్ట్ రిజర్వ్ చేసింది.
లిక్కర్ కేసులో సీబీఐ వాదనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితది కీలకపాత్ర అని సీబీఐ చెబుతోంది. సౌత్ గ్రూప్‌నకు చెందిన వ్యాపారవేత్త సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని తెలిపింది. లిక్కర్ బిజినెస్‌కు సహకరిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారన్నారు. లిక్కర్ వ్యాపారులను సీఎం కేజ్రివాల్‌కు కవిత కలిపారని సీబీఐ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు.
దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను అరెస్టు చేసిన ఈడీ మరికొందకు ఆప్ నేతలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది.
Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.