Share News

Dil Raju: ఐటీ దాడులపై దిల్‌ రాజ్ ఫస్ట్ రియాక్షన్..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:55 AM

Dil Raju: కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో మా వద్ద డబ్బు డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారని.. కానీ రూ.20 లక్షలలోపు మాత్రమే ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. అంతా క్లీన్‌గా ఉందని.. డిపార్ట్‌మెంట్ వారు ఆశ్చర్యపోయినట్లు ఆయన అన్నారు.

Dil Raju: ఐటీ దాడులపై దిల్‌ రాజ్ ఫస్ట్ రియాక్షన్..
Producer Dil Raju

హైదరాబాద్, జనవరి 25: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, ఆయన కుమార్తె హస్మిత రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున ఐటీ తనిఖీలు ముగిశాయి. ఈ క్రమంలో ఐటీ అధికారుల దాడులపై నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) మీడియాతో మాట్లాడుతూ... నాలుగు రోజులుగా ఐటీ దాడులు జరిగాయని.. నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేశారని తెలిపారు. కొన్ని ఛానెల్స్ , సోషల్ మీడియాలో మా వద్ద డబ్బు డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారని.. కానీ రూ.20 లక్షలలోపు మాత్రమే ఉన్నాయని తెలిపారు.


ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. 24 క్రాఫ్ట్స్‌లో లావాదేవీల డిటైల్స్ తీసుకున్నారని చెప్పారు. పైనల్‌గా తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చెక్ చేశారన్నారు. అంతా క్లీన్‌గా ఉందని.. డిపార్ట్‌మెంట్ వారు ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ‘‘మా ‌అమ్మకు లంగ్స్ ఇన్ఫెక్షన్‌ వల్ల చికిత్స తీసుకున్నారు. దయచేసి మా మీద తప్పుడు వార్తలు వేయవద్దు.. నేనేమి టార్గెట్ అవ్వలేదు.. మా‌ మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయింది... ఇదంతా ప్రాసెస్ .. ఎక్కువగా ఊహించుకొవద్దు.. ఎలాంటి హడావుడి లేదు... ఇండస్ట్రీ లో అంతా ఆన్‌లైన్‌లో బుకింగ్ .. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి’’ అని వెల్లడించారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయన్నారు. కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడతామన్నారు. అది తప్పు.. తీరు మార్చుకోవాల్సిందే అని అన్నారు. రైడ్స్ జరగటం వల్ల తామెంత క్లీన్‌గా ఉన్నామో కూడా తెలుస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని.. ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు పేర్కొన్నారు.

ఎంపీ పదవికి విజయసాయి రాజీనామా..


కాగా.. ఈనెల 21న టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు ఇళ్లలో ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఈనెల 21 నుంచి 25 వరకు తనిఖీలు కొనసాగాయి. ఫిల్మ్‌డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్‌‌రాజు, పుష్ప-2 డైరెక్టర్‌‌‌‌ సుకుమార్‌‌‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌ నెక్కంటి శ్రీధర్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు.. మైత్రీ మూవీ మేకర్స్‌‌, మ్యాంగో మీడియా, దిల్‌‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సహా పలు సంస్థల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ చిత్రాలకు సంబంధించిన లాభాలపై ఆరా తీసిన అధికారులు.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజుకు సంబంధించి ఇళ్లు, దిల్‌ రాజు ప్రొడక్షన్స్, శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లోనూ ఐటీ సోదాలు చేసింది. గత రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీశారు.


ఇవి కూడా చదవండి..

రేపు భారత మాతకు మహాహారతి

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 11:57 AM