Home » Fire Accident
హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి 16 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు.
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.
యాభై మంది పనిచేస్తున్న పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో చిక్కుకుంటే.. అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఐదుగురి ప్రాణాలు కాపాడాడో 16 ఏళ్ల బాలుడు! రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో జరిగిందీ ఘటన.
మండలంలోని మేడాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన చీనీతోటకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. రైతు పసల రత్నమ్మ, టీడీపీ కార్యకర్తలైన ఆమె కుమారులు తెలిపిన మేరకు...గ్రామ సమీపంలో రెండెకరాల పొలంలో దాదాపు 15 ఏళ్లుగా 450 చీనీ చెట్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందని రైతు రత్మమ్మ తెలిపారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో తోటకు ...
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
ఢిల్లీ(Delhi) ఘాజీపూర్(Ghazipur)లోని డంపింగ్ యార్డు(landfill)లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా నల్లని పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఇన్నోవా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.
నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని రఘునాథ్ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లోనుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం, కొత్తూరు గ్రామ సమీపంలో అర్ధరాత్రి అట్ట పెట్టెలతో ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. బళ్లారి నుంచి హైదరాబాద్కు అట్ట పెట్టెల లోడుతో వెళుతున్న లారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు రావడాన్ని గ్రహించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
హైదరాబాద్లో నేటి తెల్లవారుజామున రెండు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఆయిల్ గోదాంలో కాగా.. మరొకటి ప్లాస్టిక్ పరిశ్రమలో జరిగింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.