Home » G20 summit
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
దేశ రాజధాని నగరం జీ20 సదస్సుకు వడివడిగా తయారవుతోంది. వివిధ దేశాధినేతలు, అధికారుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి భారీ కొండముచ్చుల బొమ్మలతో కూడిన కటౌట్లు స్వాగతం పలుకబోతున్నాయి. వినే అవకాశం ఉంటే కొండముచ్చులు చేసే శబ్దాలను కూడా వినవచ్చు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ చెప్తున్నారని, అవన్నీ అవాస్తవాలని పునరుద్ఘాటించారు.
ప్రతిష్టాత్మక జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు 29 మంది దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు...
వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడటం కన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.
భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి.
పూర్వ సంస్కృతికి భౌతిక విలువ ఉందని, అంతేకాకుండా అది దేశ చరిత్ర, గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు చేరువై, ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం నుంచి దేశాలు తమను తాము కాపాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇతర దేశాల సంక్షోభాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఆ దేశాలను దోపిడీ చేసే శక్తులు ఉన్నాయన్నారు.
భాతరదేశంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకు కారణం..
దేశ రాజధాని నగరం ఢిల్లీ, నగర పాలక సంస్థ ప్రాంతాలు మూడు రోజులపాటు జన సంచారం లేక బోసిపోబోతున్నాయి. జీ20 నేతల సమావేశాల నేపథ్యంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించబోతుండటంతోపాటు రవాణా వ్యవస్థలపై కూడా ఆంక్షలు విధించబోతున్నారు.