Home » Google
గూగుల్ మ్యాప్స్‌ని(Google Maps) నమ్ముకుని ముందుకెళ్తే ఇక అంతే అనేలా మారుతున్నాయి పరిస్థితులు. మ్యాప్ లొకేషన్ రోడ్డుని కాకుండా గోతులు, నదుల్లోకి చూపించడమే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలో ఇలాంటి మరో ఘటన జరిగింది.
గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ జెమిని(Google Gemini) ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్‌లను కంపోజ్ చేయడానికి, భారీ ఇమెయిల్‌లను సంగ్రహించడానికి, ప్రెజెంటేషన్ నుంచి వివిధ అంశాలను హైలైట్ చేయడానికి, ముఖ్యమైన సమావేశాల కోసం రిమైండర్లను సెట్ చేయమని అడగడానికి జెమిని ఉపయోగపడుతుంది.
మీరు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ బ్రౌజర్ క్రోమ్‌ను వాడుతున్నారా? అయితే.. ఇకపై ఎంచక్కా మీరు మీ మొబైల్లో వెబ్ పేజీలను ఆడియో రూపంలో వినొచ్చు. అంతేకాదు.. టేప్‌రికార్డర్, మ్యూజిక్ ప్లేయర్ మాదిరిగా.. రివైండ్, ఫార్వర్డ్, పాస్ వంటి ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు.
హైదరాబాదీలు.. ఇటీవల కేరళ పర్యటనకు కారులో వెళ్లారు. ఆ క్రమంలో వారు గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. దీంతో వారు కారు వాగులోకి దూసుకు వెళ్లింది. అయితే అదే సమయంలో స్థానికులు వారిని రక్షించారు. దీంతో వారు బతికిపోయారు.
గూగుల్‌కు చెందిన ఏఐ ఓవర్వ్యూస్ - వివిధ ప్రశ్నలకు స్పందించడంలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిగా తప్పు లేదంటే ఉపకరించని రీతిలో సమాధానాలను ఇస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దే పనుల్లో గూగుల్ ఉంది.
గూగుల్ హెల్త్ కనెక్ట్‌తో ఆరోగ్య సంబంధ డేటాను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించు కోవచ్చు. ఇష్టమైన హెల్త్ యాప్‌లతో అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అవసరమైన హెల్త్ డేటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీంతో పొందవచ్చు. నిజానికి వివిధ హెల్త్ ఫిట్నెస్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించుకోవడం సమస్యే. అయితే గూగుల్ అందుకు పరిష్కారంగా గూగుల్ హెల్త్ కనెక్ట్‌కు రూపకల్పన చేసింది.
గూగుల్ - మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ ఇకపై క్లౌడ్‌లో కాకుండా ఫోన్లోనే స్టోర్ కానుంది. లొకేషన్ డేటా గూగుల్ సెర్వర్లలో ఉంటే జియోఫెన్స్ వారెంట్లకు లోనుకావాల్సి వస్తోంది. ఈ మార్పుతో ఇకపై గూగుల్‌కు రెస్పాండ్ అయ్యే ఇబ్బంది తప్పుతుంది. అలాగే లొకేషన్ హిస్టరీని ఇకపై టైమ్‌లైన్ అంటారు. ‘యువర్ టైమ్‌లైన్’ ఫీచర్లో ఉంటుంది.
వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం గూగుల్ వినియోగదారుల లోకేషన్ డేటాను నిర్వహించే విధానాన్ని మారుస్తోంది. అయితే ఈ అప్లికేషన్ గతంలో గూగుల్ సర్వర్లలో అందుకు సంబంధించిన డేటా చరిత్రను నిల్వ చేసేది.
చుట్టూ చీకటి.. జోరువాన.. అలాంటి సమయంలో కొత్త ప్రాంతంలో ప్రయాణించాలంటే ఎవరైనా ఏం చేస్తారు? స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తారు. అది సూచించినట్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటారు.
ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న గూగుల్ మ్యాప్స్(Google Maps) ఒక్కో సారి కొంప ముంచుతున్నాయి. నేవిగేషన్ తప్పుగా చూపిస్తుండటంతో చాలా మంది దారులు అయోమయమై నదీ జలాల్లోకి వెళ్లిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది.