AP Politics: ముద్రగడ, హరిరామ జోగయ్యపై పవన్ షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Mar 07 , 2024 | 05:29 PM
Pawan Kalyan: ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్‌లతో ఏపీ రాజకీయం (AP Politics) ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు.
అమరావతి, మార్చి 07: ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్‌లతో ఏపీ రాజకీయం (AP Politics) ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ముద్రగడ, హరిరామ జోగయ్యలు టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేశారు. ‘మొన్నటిదాకా నాకు అలా చేయ్, ఇలా చేయ్ అని చాలా మంది సలహాలు ఇచ్చారు. నాకు సీట్లు తీసుకోవడం, ఇవ్వడం తెలియదా? నాకు సలహాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.’ అంటూ పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.
వారి వెంట కాపులు లేరు..
ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వెంట కాపులు ఎవ్వరు లేరని కాపునాడు అధ్యక్షులు పురంశెట్టి మంగరావు అన్నారు. వారి వెంట కాపులాంత ఉన్నారు అనుకోవడం చాలా తప్పు అని అన్నారు. ముద్రగడ పద్మనాభం వెనక కాపులు ఎవరు లేరని, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలో చేరుతున్నారని పురంశెట్టి మంగరావు ఆరోపించారు. ముద్రగడ వెంట కాపులంతా వెళ్లి కేసులు పెట్టించుకున్నారని ఆరోపించారు. కాపునాడు అన్ని పార్టీలకు అతీతం అని, కాపునాడు ఏ పార్టీకి అనుకూలం కాదని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలకు అనుకూలంగానే కాపునాడు పని చేస్తోందని కాపు నాయకులు శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా రాజ్యాధికరానికి నోచుకోలేనిది కాపు జాతి అని అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అబ్బిరెడ్డి సురేష్ అన్నారు. కాపునాడుకి విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ ప్రభుత్వం చెబుతుందో వారికి తమ సహకారం ఉంటుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు.