Home » Heat Waves
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఎండలు, రాత్రి వేళ చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Heat wave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి విజృంభిస్తున్నా పగటి పూట ఎండలు హడలెత్తిస్తున్నాయి.
విపరీతమైన వేడి గాలుల ప్రభావంతో ఎయిర్షోని(Colorado airshow) వీక్షిస్తున్న జనం ఒక్కసారిగా కుప్పకూలారు. వారందరికి వడదెబ్బ(Sun Stroke) తగిలిందని వైద్యులు నిర్ధారించారు.
వానాకాలంలోనూ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి పెరిగిపోవడంతో విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతోంది.
పాకిస్థాన్లోని కరాచీలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో కరాచీ నగరంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగత జీవులుగా పడి ఉన్న 22 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు.
ఉత్తర భారత దేశాన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా(JP Nadda) పరిస్థితిపై సమీక్షించారు. హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఆసుపత్రులు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వేడిగాలులు బలంగా వీస్తున్నాయి. ఆ క్రమంలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర భారతదేశం (North India)లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. 45 నుంచి 50డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు(High temperature) నమోదు అవుతుండడంతో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఉత్తర భారతదేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వేడి గాలుల(హీట్ వేవ్స్)కు ప్రజలు అల్లాడిపోతున్నారు.