Share News

Heat wave: ఏపీలో మండిపోనున్న ఎండలు... విపత్తుల సంస్థ హెచ్చరిక

ABN , Publish Date - Mar 01 , 2025 | 07:54 PM

Heat wave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి.

Heat wave: ఏపీలో మండిపోనున్న ఎండలు... విపత్తుల సంస్థ హెచ్చరిక

అమరావతి: ఎండ ప్రభావం, వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో మరింతగా ఎండ ప్రభావం ఉంటుందని చెప్పారు. మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.


ఈ మేరకు ఇవాళ(శనివారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుందని చెప్పారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. గర్బిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండలపై సమాచారానికి విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101లలో సంప్రదించాలని కోరారు. ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలు పంపిస్తామని అన్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2025 | 07:56 PM