Home » Home Minister Anitha
Andhrapradesh: ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఏం పగులగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శ చేయడానికి..
Andhrapradesh: విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పని చేయడానికి సరైన వసతులు లేవని.. మహిళ పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యూట్ హౌస్లో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్, జాయింట్ సీపీ ఫకీరప్పతోపాటు నగరంలోని పైస్థాయి పోలీస్ అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు.
సైకో జగన్ పాలనలో అల్లాడిన రాష్ట్రానికి హోంమంత్రి అవడం అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని వంగలపూడి అనిత అన్నారు. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని, ఆడపిల్లల వైపు తప్పుగా చూడాలన్నా భయపడే విధంగా లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు.
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.