Home » HYDRA
భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
అనుమతులున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయబోదని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. చట్టబద్దమైన అనుమతులతో నిర్మాణాలు చేపట్టిన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను సైతం కూల్చివేస్తామంటూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినేనని అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని అన్నారు.
వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్పాత్లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.
హైడ్రా బాధితులకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ భవన్లో నిర్వహించిన సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshmareddy)తోపాటు మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది.
పేదల ఇళ్లుకూల్చి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టి డబ్బు వసూళ్ల కోసమే రేవంత్ సర్కార్ హైడ్రా తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు.