Home » India vs South Africa
Virat Kohli: సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు.
ఆసక్తి రేపిన భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.
Boxing Day Test: టీమిండియాతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మొదట బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌తో తమ జట్టు నుంచి నాండ్రే బర్గర్, డేవిడ్ బెడింగ్‌హామ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేంట్రం చేస్తున్నట్టు చెప్పాడు.
క్రికెట్‌లో బాక్సింగ్ డే కు మంచి ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏడాది బాక్సింగ్ డే రోజున ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభవుతుంటాయి. వాటిని బాక్సింగ్ డే టెస్టులు అని పిలుస్తుంటారు. ఆయా క్రికెట్ బోర్డులు కూడా బాక్సింగ్ డే రోజున తమ జట్ల మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్ చేస్తుంటాయి.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు కీలక సవాలుకు సిద్ధమైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సమం చేసి, వన్డే సిరీస్‌ను గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. దీంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Sunil Gavaskar: మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒకసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
దక్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్‌లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్మెంట్కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి.