Home » India
క్షణ రంగం(Defense sector)లో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్(INDIA) గణనీయమైన పురోగతి సాధిస్తోంది. అత్యాధునిక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (ఎల్‌ఆర్‌ఎస్‌ఏఎం)ను స్వదేశీయంగా అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టింది.
బాస్మతీయేతర బియ్యం(Rice) ఎగుమతులపై భారత ప్రభుత్వం(Government of India) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
శ గౌరవ, మర్యాదలను కాపాడటం కోసం నియంత్రణ రేఖ (LoC)ని దాటడానికైనా వెనుకాడేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ప్రజలు సైనికులకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ(PM MODI) వ్యాఖ్యలపై విపక్షాలు(oppositions) మండిపడ్డాయి. 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ‘ఇండియా’(India)ను చూసి మోదీ భయకంపితులయ్యారని పేర్కొన్నాయి.
కులాలవారీ జనాభా లెక్కలను సేకరించాలని కొందరు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు ఓ విషయాన్ని చెప్పింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు మినహా మిగిలిన కులాల జనాభాను కులాలవారీగా సేకరించలేదని తెలిపింది.
గతంలో ఈస్ట్ అండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వారి పేర్లలో కూడా ఇండియా ఉందని విపక్షాల కూటమి ఇండియాపై ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటుగా స్పందించారు. ''మోదీజీ...మీరు మమ్మల్ని ఏవిధంగానైనా పిలవండి...మేము INDIA'' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
సరిహద్దుల్లో పదే పదే ఉద్రిక్తతలను సృష్టిస్తున్న చైనాను భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) తీవ్రంగా ఎండగట్టారు. ఇరు దేశాలకు సరిహద్దుగా పరిగణిస్తున్న వాస్తవాధీన రేఖ (LAC) రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న పరిస్థితుల వల్ల పరస్పర వ్యూహాత్మక విశ్వాసం దెబ్బతిందని స్పష్టం చేశారు.
మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్నారు. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది.
భారత దేశంలోకి అక్రమంగా, చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనీయులు ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. వీసా, చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా బిహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా గుండా భారత దేశంలోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నించారు. వీరు ఈ విధంగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రస్తుతం వెల్లడికాలేదు.
భారత దేశం, శ్రీలంక పరస్పర భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం లైన్, ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఆచరణ సాధ్యత గురించి ఇరు దేశాలు అధ్యయనం చేస్తాయన్నారు.