Home » India
వారిద్దరిదీ ఒక ఊరు కాదు. అలాగని ఒక జిల్లా, రాష్ట్రం.. చివరికి ఒక దేశం కూడా కాదు. ఒకరిదేమో పాకిస్తాన్, మరికొరిదేమో భారత్.. కానీ లండన్‌లో కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ..
నెట్‌ఫిక్స్ (Netflix) సబ్‌స్క్రైబర్లకు ఇది చేదు వార్త. పాస్‌వర్డ్ షేరింగ్ సదుపాయాన్ని భారత దేశంలో రద్దు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ గురువారం ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు తమ అకౌంట్‌ను తమ కుటుంబం కోసం మాత్రమే వినియోగించుకునే విధంగా నియంత్రించినట్లు తెలిపింది.
జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది.
ప్రతిపక్షాల కూటమికి ఇండియా (Indian National Developmental Inclusive Alliance) పేరును నిర్ణయించడం వెనుక చాలా కసరత్తు జరిగింది. ఎన్డీయే వర్సెస్ ఇండియాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పేరును సూచించారు.
Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి చాలా అంశాల నాడి తెలుసునని, వాటిని ఆయన విధానాలు, పథకాలుగా మార్చుతారని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చెప్పారు.
ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)ని శిరోమణి అకాలీ దళ్ (SAD) వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని చెప్పింది. దీనిపై నిజాయితీగా దేశవ్యాప్తంగా అన్ని మతాల ఏకాభిప్రాయం పొందకుండా, దీనిని అమలు చేయడం సరికాదని, మరీ ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల సమ్మతి పొందాలని తెలిపింది.
భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో శుక్రవారం విప్లవాత్మక పరిణామం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యే విధంగా యుద్ధ విమానం ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.
భారత దేశంలోని ప్రియుడి కోసం వచ్చానని చెప్తున్న పాకిస్థానీ మహిళ సీమా గులాం హైదర్‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ముంబై పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించకపోతే 26/11 ముంబై ఉగ్రవాద దాడి తరహాలో భారీ ఉగ్ర దాడి జరుగుతుందని ఆ కాలర్ హెచ్చరించినట్లు తెలిపారు.
చంద్రుడి గురించి తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం మరికాసేపట్లో జరగబోతోంది. యావత్తు ప్రపంచం దీనిని ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తోంది.