Instagram: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 01:08 PM
ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పరిచయమైన ఓ వివాహిత కోసం కూకట్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఇల్లు విడిచి వెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది.

- ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం...
- యువకుడు అదృశ్యం
హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పరిచయమైన ఓ వివాహిత కోసం కూకట్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఇల్లు విడిచి వెళ్లిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ ఫేజ్-4 బస్తీరాం కుమావల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరి రెండవ కుమారుడు పవన్‌కుమావల్(21) ఈ నెల 6న ఇల్లు విడిచి వెళ్లాడు. ఇల్లు విడిచి వెళ్లిన రెండురోజుల తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, పూణే నగరానికి దగ్గరలో గుర్తుతెలియని ప్రదేశంలో ఉన్నానని చెప్పి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Tungabhadra: తుంగభద్రలో గల్లంతైన వైద్యురాలి మృతదేహం లభ్యం
దీంతో తండ్రి బస్తీరాం కుమావల్ కొడుకు స్నేహితులు వద్ద విచారించాడు. పవన్‌కు ఇటీవల ఇన్‌స్ర్టాగ్రామం(Instagram)లో ఓ వివాహితతో పరిచయం ఏర్పడిందని ఆమెకు ఓ కుమారుడు సైతం ఉన్నాడని, ఆ మహిళ కారణంగానే తమ కుమారుడు ఇల్లు విడిచి వెళ్లాడని తెలుసుకున్నారు. తమ కుమారుడి కోసం ఫోన్ చేసిన ప్రతిసారి సదరు మహిళ ఫోన్ అన్సర్ చేసి తమకు ఫోన్ చేయ్యవద్దని ఫోన్ చేస్తే పవన్‌ను చంపి తాను చస్తానని బెదిరిస్తుందని బస్తీరామ్ గురువారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News