Instagram Viral: ఇన్‌స్టాగ్రామ్‌పై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా..
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:00 AM
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది. సాధారణంగా సెన్సిటివ్ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు కనిపించకుండా అర్గారిథమ్ నిలువరిస్తుంటుంది. అయితే ప్రస్తుతం అందరికీ ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి..

సోషల్ మీడియాలోని అతి పెద్ద ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటిగా అవతరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తప్పనిసరి అయింది. మరోవైపు ఈ వేదికగా ఎంతో మంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాగే కొందరు పేరుతో పాటూ ఆదాయం కూడా అందుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఏ వీడియో పడితే ఆ వీడియోలను షేర్ చేసేస్తున్నారు.అయితే వీటిలో సెన్సిటివ్ కంటెంట్ ఉన్న వీడియోలను కట్టడి చేసేలా ఇన్‌స్టాగ్రామ్ అర్గారిథమ్ కట్టడి చేస్తుంటుంది. ఇదిలావుండగా.. ప్రస్తుతం ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది. హింసాత్మక వీడియోలతో పాటూ చూసేందకు ఇబ్బందిగా ఫీలయ్యే వీడియోలు కూడా తమకు కనిపిస్తున్నాయంటూ యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో అర్గారిథమ్‌పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్లకు ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది. సాధారణంగా సెన్సిటివ్ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు కనిపించకుండా అర్గారిథమ్ (Algorithm) నిలువరిస్తుంటుంది. అయితే ప్రస్తుతం అందరికీ ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. మామూలుగా ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్‌లు (Updates) చేస్తూ సెక్యూరిటీ పరంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే కొత్త కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది.
మనకు ఎలాంటి వీడియోలను చూడడం ఇష్టమో.. అలాంటి వీడియోలే కనిపించేలా సెట్టింగ్స్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అయితే సున్నితమైన కంటెంట్ వీడియోలను (Sensitive content videos) ఎనేబుల్ చేసిన వారికి కూడా హింసాత్మక వీడియోలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల చాలా మంది యూజర్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్ మొత్తం NSFW (Not safe for work) కంటెంట్‌తో నిండిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. రీల్స్ స్ర్కోల్ చేస్తుంటే మధ్యలో రక్తపాతంతో నిండిని వీడియోలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని గమనించిరా.. గంటల వ్యవధిలో నా ఇన్‌స్టా రీల్స్ ఫీడ్ మొత్తం హింసాత్మ వీడియోలతో నిండిపోయింది.. నాకే ఇలా జరుగుతోందా.. లేక అంతా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా’’.. అంటూ ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. ‘‘నాకైతే కేవలం హింసాత్మక వీడియోలు తప్ప.. మీరేవీ కనిపించడం లేదు’’.. అంటూ మరో వినియోగదారుడు వాపోతున్నాడు. ‘‘నాకు గొడవలకు సంబంధించిన వీడియోలు, మోసం చేసుకునే ప్రేమ జంటల వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి’’.. అంటూ ఇంకో యూజర్ ఆరోపించాడు. ‘‘ఆఖరికి చిన్న పిల్లలను చంపుతున్న వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్య ఇంతకు ముందు ఎప్పుడూ లేదు’’.. అంటూ ఓ వినియోగదారుడు ప్రస్తావించాడు.
అల్గారిథమ్‌లో మార్పులే కారణమా..
ఈ సమస్యపై మెటా యాజమాన్యం అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ మోడరేషన్ సిస్టమ్ (Instagram Content Moderation System) లో బగ్‌లు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సున్నితమైన కంటెంట్ వీడియోలను స్కాన్ చేసే AI సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా ఇలాంటి సమస్య తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌లో మార్పు, చేర్పుల వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చని అంటున్నారు. మెటా దీనిపై స్పందించి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యూజర్లు కోరుతున్నారు. మరి దీనిపై యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..