Home » Jagan
వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పరాభవం ముటగట్టుకున్న వైసీపీకి మరో షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి రావడానికి క్యూ కడుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు కనిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు కనిపించే నేతలు.. గత రెండు నెలలుగా ఏమైందో ఏమో గాని ప్రజల్లో కనిపించడంలేదనే టాక్ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది.
విశాఖపట్టణంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయనే సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు.