Home » Kadiri
రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం సూచించారు. శనివారం మండలంలోని పట్నం ప్రభుత్వం ఆసుపత్రి, కుటాగుళ్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం గోకులాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని గోళ్లవారిపల్లి, కోటూరు గ్రామాల్లో మహిళా రైతుల కోసం నిర్మించిన గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అణగదొక్కాలని చూస్తే సహించబోమనీ, చేనేత కులాల సత్తా ఏంటో చూపుతామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉద్ఘాటించారు. స్థానిక శివానగర్లోని శివాలయం వద్ద పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఎమ్యెల్యే కందికుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పౌరహక్కులపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ ఎ. రత్న పేర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీకాలనీలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.
గ్రీన ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంతో తమ పొలాలకు రోడ్డు సౌకర్యం లేకుండపోతోందని, రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
జైళ్లలో ఏళ్లుగా మగ్గిపోతున్న వయోవృద్ధులకు విముక్తి కల్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శ్రీకారం చుట్టిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.
రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని పుట్టపర్తి జూనియర్ సివిల్ నాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి రాకేష్ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు.
ప్రజలు అధికారమితిచ్చింది రాజకీయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికో, కొట్టేయడానికో కాదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడానికి విధి విధానాలు తెలియచేడానికి ఆదివారం సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు.
వివాదాల్లో ఇరుక్కుని విడిపోయిన మనుషులను మధ్యవర్తిత్వ చట్టం ద్వారా కలుసుకునే అవకాశం ఉం దని న్యాయాధికారులు ఎస్ ప్రతిమ, పీ మీనాక్షి సుందరి అన్నారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచిమార్గంలో నడిపించాలని 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్ భీమనేని ప్రసాద్నాయుడు, పాఠశాల హెచఎం నాగప్ప అన్నారు.