Share News

Nara Lokesh: కనిగిరి నియోజకవర్గంలో సీబీజీ ఫ్లాంట్‌కు మంత్రి లోకేష్‌ భూమి పూజ

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:19 PM

గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశానన్నారు. కానీ పులివెందుల ఎమ్మెల్యే నుండి సౌండ్ లేదన్నారు.

Nara Lokesh: కనిగిరి నియోజకవర్గంలో సీబీజీ ఫ్లాంట్‌కు మంత్రి లోకేష్‌ భూమి పూజ
Minister Nara Lokesh

ప్రకాశం జిల్లా: కనిగిరి (Kanigiri) నియోజకవర్గంలో సీబీజీ ప్లాంట్‌ (CBG Plant)కు ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) బుధవారం భూమి పూజ (Bhoomi Pooja) చేశారు. అనంతరం మంత్రి బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది పౌరుషం, ప్రేమ అని, 2019లో ఎదురు గాలి ఉన్నా నాలుగు సీట్లు గెలిపించారని, 2024లో 10 సీట్లు గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించామన్నారు.

Also Read..: బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు


గత ఐదేళ్ల లో రాష్ట్రంలో విధ్వంసం..

గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశానన్నారు. కానీ పులివెందుల ఎమ్మెల్యే నుండి సౌండ్ లేదన్నారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, ‘మా బ్రాండ్ సిబిఎన్’ అని.. ఎన్నికల్లో సైకో పాలనకు ప్రజలు బైబై చెప్పారన్నారు. రాష్ట్రానికి అనేక కంపెనీలు రాబోతున్నాయని, రిలయన్స్ ఫౌండేషన్ ధీరుబాయి అంబానీ, సీఎం చంద్రబాబుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ అంటే స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని చూపిస్తామని స్పష్టం చేశారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌లు ఏపీలో పెట్టేందుకు రిలయన్స్ ముందుకు వచ్చిందన్నారు.


మొదటి ప్లాంట్ నిర్మాణం కనిగిరిలో..

మొదటి ప్లాంట్ నిర్మాణం కనిగిరిలో చేస్తున్నామని, ఈ పెట్టుబడుల ద్వారా ఏపీలో 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. కనిగిరిలో యువగళంలో ఇచ్చిన మొదటి హామీని నిలబెట్టుకున్నానని అన్నారు. సీబీజీ ప్లాంట్ వలన రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లాకు ఎప్పుడు వచ్చినా తన పాదయాత్ర గుర్తొస్తుందన్నారు. ‘అందరూ నా చేతులు గీరారు... కొంత మంది కొరికారు’ అన్నారు. కనిగిరిలో రైల్వే ప్రాజెక్టు కోసం కృషి చేస్తామని మంత్రి చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా అది సాధించే వ్యక్తి అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ తనకు అన్న అని లోకేష్ అన్నారు.

గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మళ్లీ నిధులు తీసుకువచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుందని, వాళ్లు పని చేయరని.. ఇంకొకరు పనిచేస్తే చేయనివ్వరని అన్నారు. సీబీసీ ప్లాంట్‌కు వైసీపీ నాయకులు అడ్డుపడొద్దని లోకేష్ సూచించారు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ పేర్లు రెడ్ బుక్‌లోకి ఎక్కుతాయని హెచ్చరించారు. సైకో పాలనకు తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని ఆనాడే చెప్పామన్నారు. 94 శాతం సీట్లలో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారని, త్వరలో త్రిబుల్ ఐటీకి శంకుస్థాపన చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 01:19 PM