Home » Kejriwal
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది.
ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఢిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ (DERC) చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేశ్ కుమార్ ప్రమాణ స్వీకారాన్ని జూలై 11 వరకు వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు ముడుపులు అందాయని, 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో...
ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారంనాడు సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన అధికారిక బంగళా ఆధునీకరణ, పునర్నిర్మాణ కార్యకలాపాల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని CAGను కోరింది.
విపక్షాల ఐక్యతపై ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' నేత అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల ఐక్యతను వేగవంతం చేసేలా కేజ్రీవాల్ ప్రకటనలు లేవని, విపక్ష ఐక్యతా యత్నాలను దెబ్బతీసి బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు.
బిహార్‌లోని పట్నా వేదికగా శుక్రవారం (రేపు) నిర్వహించతలపెట్టిన కీలక ప్రతిపక్షాల భేటీకి (all party meeting) ఒక్క రోజు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా పేర్కొంటూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తమకు మద్ధతివ్వకుంటే ప్రతిపక్షాల భేటీకి హాజరుకాబోమని ఆప్ (AAP) అల్టిమేటం విధించింది.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నియంతను గద్దె దింపేందుకు ఉద్యమించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ పరోక్షంగా మోదీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ పిలుపునిచ్చారు. ఢిల్లీ పాలనాధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో ఆదివారం భారీ సభను ఏర్పాటు చేశారు.