TG NEWS: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:48 AM
Telangana:ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. బస్సు టైరు పేలడంతోనే ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది.యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది.
సూర్యాపేట: సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై ఇవాళ(శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు( CG 17KS7719) ఢీకొంది. ఈ బస్సు గుప్తా ట్రావెల్స్‌కు చెందినదిగా సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి సూర్యాపేట డీఎస్పీ రవి, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్గటన జరిగింది. టైర్ పేలి పక్కకు ఆపుకున్న ఇసుక లారీని బస్సు ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Sankranti festival: చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి
High Court: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
Read Latest Telangana News and Telugu News